అల్లు అర్జున్ అరెస్ట్ నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు చేస్తున్న వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ తాజాగా మరో సంచలన ట్వీట్ చేశారు. గతంలో రేవంత్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసిన వీడియోను పోస్ట్ చేసి.. 'రేవంత్ రెడ్డి, అల్లు అర్జున్ అరెస్ట్‌లో కామన్ పాయింట్ ఏంటటీ?' అని క్యాప్షన్ ఇచ్చారు. దానికి కొనసాగింపుగా ‘వాళ్లిద్దరూ తమ బెడ్‌రూమ్‌లో ఉన్నప్పుడే అరెస్ట్ అయ్యారు' అని రాసుకొచ్చారు.