AP: నంద్యాల జిల్లా ఆళ్లగడ్డలో వైసీపీ కౌన్సిలర్ అరాచకం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. యువతిపై వైసీపీ కౌన్సిలర్ చక్రపాణి అల్లుడు భాస్కర్ అత్యాచారానికి యత్నించాడు. బాధిత యువతి ప్రతిఘటించి భాస్కర్‌ను చెంపదెబ్బ కొట్టింది. యువతి తనను కొట్టిందని మామకు ఫిర్యాదు చేశాడు. ఆగ్రహంతో కౌన్సిలర్ చక్రపాణి బాధితురాలి కుటుంబంపై దాడి చేశాడు. గాయపడిన వారిని స్థానికులు నంద్యాల ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.