వాతావరణ మార్పులతో రైతుల్లో ఆందోళన నెలకొంది. ఘంటసాల మండలంలో పంట చేతికి వచ్చిన తరుణంలో తుఫాను హెచ్చరికల నేపథ్యంలో రైతుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మంగళవారం కోతలు కోసిన రైతులు ధాన్యాన్ని బస్తాల్లోకి ఎత్తి ఇంటి ముందు పరదాలు కప్పి ఉంచారు. జిపిఎస్ ట్రాకింగ్ చేయడం ఆలస్యం కావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ సమయంలో వర్షం కురిస్తే పూర్తిగా నష్టపోతామని రైతులు భయపడుతున్నారు.