భర్తను హతమార్చిన భార్య, అత్త
బాపులపాడు మండలం బొమ్ములూరు గ్రామానికి చెందిన కన్నెగంటి రామభూషణం రావు శుక్రవారం రాత్రి ఇంట్లో నిద్రిస్తూండగా తన భార్య నాగశిరోమణి, తల్లి అవిరినేని ఝాన్సి లక్ష్మీ కర్రతో తల మీద కొట్టి హత మార్చారు. మృతుని అక్క పెండ్యాల పూర్ణ కుమారి శనివారం ఫిర్యాదు ఇచ్చారు. ఈ ఫిర్యాదు పై హనుమాన్ జంక్షన్ సిఐ కెవివి సత్యనారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.