Oct 28, 2024, 15:10 IST/పెద్దపల్లి
పెద్దపల్లి
రక్తదానం చేయండి.. ప్రాణ దాతలుగా నిలవండి: సీపీ
Oct 28, 2024, 15:10 IST
రక్తదానం చేసి.. ప్రాణదాతలుగా నిలవాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాస్ అన్నారు. సోమవారం పోలీస్ అమరవీరుల వారోత్సవాల సందర్భంగా సబ్ డివిజన్ పోలీస్ ఆధ్వర్యంలో లయన్స్ క్లబ్ సహకారంతో పెద్దపల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో రక్తదానం శిబిరం ఏర్పాటు చేయగా, ముఖ్య అతిధిగా సీపీ హాజరై శిబిరాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దపల్లి డిసిపి చేతన, ఏసిపిలు కృష్ణ, నరసింహులు, సర్కిల్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.