చల్లపల్లి: సి.ఆర్ ఫౌండేషన్ సేవలు మరింత విస్తరిస్తాం
చండ్ర రాజేశ్వరరావు ఫౌండేషన్ సేవలు మరింత విస్తరించి పేద ప్రజలకు అందుబాటులో తెచ్చేందుకు కృషి చేస్తున్నట్లు సిపిఐ రాష్ట్ర నేత కే.నారాయణ పేర్కొన్నారు గురువారం కృష్ణా జిల్లా చల్లపల్లిలోని చండ్ర రాజేశ్వరరావు వికాస కేంద్రంను ఆయన పరిశీలించారు. అక్కడ జరుగుతున్న సేవా కార్యక్రమాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో సి.ఆర్ ఫౌండేషన్ నడుస్తుందని తెలిపారు.