తెలంగాణలో 13 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. రంగారెడ్డి కలెక్టర్‌గా నారాయణరెడ్డి, నల్గొండ జిల్లా కలెక్టర్‌గా త్రిపాఠి, యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్‌గా హనుమంతరావు నియమితులయ్యారు. డెయిరీ కార్పొరేషన్ ఎండీగా కె. చంద్రశేఖర్‌రెడ్డి, నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్‌గా ఎస్. దిలీప్‌కుమార్‌ను నియమించారు.