చల్లపల్లి: రహదారి క్రుంగిపోయి ఇబ్బందులు పడుతున్నాము
చల్లపల్లి మండలం ఆముదారులంక వద్ద ప్రధాన రహదారి క్రుంగిపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు పేర్కొన్నారు. సోమవారం కుంగిపోయిన రహదారి మీద అక్రమంగా ఇసుక ట్రాక్టర్లు వెళ్లడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కృష్ణానది రేవు నుంచి ఈ ప్రధాన రహదారిపై 30 ఇసుక ట్రాక్టర్లు రావడంతో అడ్డుకున్నట్లు తెలిపారు. ఇసుక ట్రాక్టర్ యజమానులు దురుసుగా మాట్లాడుతున్నారని, మా గ్రామం నుంచి ఇసుక తరలించవద్దని కోరారు.