కృష్ణా జిల్లాలో విషాదం నెలకొంది. విద్యుత్ షాక్ తో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. వివరాల్లోకి వెళ్తే..గంపలగూడెం మండలం పెనుగొలనులో సుబాబుల్ లోడుతో వెళుతున్న లారీకి బుధవారం విద్యుత్ తీగలు తగిలాయి. దీంతో లారీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు వెంటనే పోలీసులు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.