గత ఐదేళ్ల కాలంలో కృష్ణజిల్లా డిసిసిబి, గుంటూరు జిల్లా డిసిసిబిలలో జరిగిన అవినీతి, అవకతవకలపై విచారణ జరిపించాలని గన్నవరం నియోజకవర్గ శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు కోరారు. బుధవారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం సహకార సంఘాల కోసం రూ. 308 కోట్లు కేటాయించినందుకు గాను ధన్యవాదాలు తెలిపారు. దేశ ఆర్థిక వ్యవస్థకు సహకార సంఘాలు ఒక బలమైన శక్తిగా ఉన్నాయని ఆయన పేర్కొన్నారు.