విజయవాడ రూరల్ మండలం రామవరప్పాడు శ్రీ వెంకమ్మ పేరంటాలు అమ్మవారి దేవస్థానంలో సంక్రాంతి పండుగ మహోత్సవాలు సందర్భంగా మంగళవారం గన్నవరం శాసనసభ్యులు యార్లగడ్డ వెంకట్రావు సతీసమేతంగా విచ్చేసి అమ్మవారి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు దేవస్థానానికి విచ్చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు ఉత్సవ కమిటీ సభ్యులు, కూటమి నాయకులు స్వాగతం పలికారు.