గన్నవరం - Gannavaram

134వ బూత్ లో ఎన్నికల ప్రచారం

134వ బూత్ లో ఎన్నికల ప్రచారం

గన్నవరం టౌన్ లో స్థానిక 134 వ బూత్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ ఉమ్మడి శాసనసభ అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పార్లమెంట్ అభ్యర్థి బాల శౌరి విజయాన్ని కాంక్షిస్తూ నాయకులు ఆదివారం ఇంటి ఇంటికి ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్బంగా ఓటు బ్యాలెట్ నమూనా మరియు ఈవిఎం నమూనా లతో ఇంటి ఇంటికి తిరుగుతూ ఓటర్లకు అవగాహన కల్పిస్తూ సైకిల్ గుర్తు పై, గాజు గ్లాసు గుర్తు పై ఓటు వేసి యార్లగడ్డ వెంకట్రావు ని, బాలశౌరి కి అఖండ విజయం చేకూర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో గన్నవరం టౌన్ అధ్యక్షులు జాస్తి శ్రీధర్, బుస్సే సరితా దేవి, వేల్పూరి నాగరాజు, మణికంఠ, తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వీడియోలు


రాజన్న సిరిసిల్ల జిల్లా