ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీను అమలు చేస్తూ రాష్ట్ర అభివృద్ధికి, ప్రజలకు మంచి చేయడం కోసం సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అహర్నిశలు శ్రమిస్తుందని గుడివాడ నియోజకవర్గ కూటమి పార్టీల నాయకులు అన్నారు. శుక్రవారం నందివాడ మండలం జొన్నపాడు గ్రామంలో దీపం పథకాన్ని గుడివాడ
జనసేన పార్టీ ఇంచార్జ్ బూరగడ్డ శ్రీకాంత్, కూటమి పార్టీల నాయకులతో కలిసి
టీడీపీ నాయకులు వెనిగండ్ల రామకృష్ణ (నాని) ప్రారంభించారు.