రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్ళుగా భావిస్తూ సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగానే ముందుకు సాగుతుందని గుడివాడ మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం నందివాడ మండలంలో నిర్వహించిన పల్లె పండగ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే రావి పాల్గొన్నారు. మండలంలోని వెన్ననపూడి గ్రామాల్లో నిర్వహించిన పల్లె పండగలో పాల్గొన్న నాయకులకు ప్రజలు ఘన స్వాగతం పలికారు.