జగ్గయ్యపేట: పాలేరు బ్రిడ్జిని పరిశీలించిన సిపిఐ నాయకులు
జగ్గయ్యపేట మండలం గరికపాడు రాష్ట్ర సరిహద్దు నేషనల్ హైవే 65 పై వరదల కారణంగా పాడైన పాలేరు బ్రిడ్జిని సిపిఐ నాయకులు గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నియోజకవర్గ కార్యదర్శి అంబోజి శివాజీ, పట్టణ కార్యదర్శి జూనెబోయిన శ్రీనివాసరావులు మాట్లాడుతూ వరదల కారణంగా నేషనల్ హైవే 65 రాష్ట్ర సరిహద్దు పాలేరు బ్రిడ్జి అంచులు పాడై ఒక్క వైపే వాహనాల రాకపోకలు సాగుతున్నాయని ఆరోపించారు.