తెలుగుదేశం నేతలపై బెదిరింపులు

1067చూసినవారు
తెలుగుదేశం నేతలపై బెదిరింపులు
కృష్ణాజిల్లా జగ్గయ్యపేట మండలం పోచంపల్లి గ్రామానికి చెందిన తెలుగుదేశం నేతలపై వైసీపీ కార్యకర్త సామాజిక మాధ్యమంలో బెదిరింపులకు దిగాడు. అసభ్యపదజాలంతో 23 తేదీన వారికి చుక్కలు చూపిస్తామంటూ హెచ్చరించాడు. మంత్రి లోకేశ్‌ ఫోటోను అసభ్యంగా మార్ఫింగ్‌ చేయటంపై టీడీపీ కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సర్పంచుల సంఘం ప్రధానకార్యదర్శి, జిల్లా టీడీపీ ఆర్గనైజింగ్‌ సెక్రటరీ ముల్లంగి రామకృష్ణారెడ్డి ఫేస్‌బుక్‌లో ఈ హెచ్చరికలు, అసభ్య దూషణలను చూసి చిల్లకల్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గ్రామానికి చెందిన వైసీపీ కార్యకర్త విశాల్‌ పార్ధురెడ్డి ఫేస్‌బుక్‌ ఖాతా నుంచి ఈ బెదిరింపులు వచ్చినట్టు తెలుస్తోంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్