Dec 12, 2024, 04:12 IST/సిరిసిల్ల
సిరిసిల్ల
తంగళ్ళపల్లి: మాజీ సర్పంచ్ మృతి
Dec 12, 2024, 04:12 IST
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని తంగళ్ళపల్లి మండలంలో గల చిన్న లింగాపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ సరిదేన సత్య కుమార్ రావు అనారోగ్యంతో బుధవారం రాత్రి కన్నుమూశారు. 2014 నుంచి 2019 వరకు చిన్న లింగాపూర్ గ్రామ సర్పంచిగా ప్రజలకు అందుబాటులో ఉండి సేవలు అందించారు. సత్య కుమార్ మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నాయకులు మరియు గ్రామస్తులు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.