జగిత్యాల జిల్లా మల్యాల మండలం మ్యాడంపల్లిలో బుధవారం రాత్రి గాతం తిరుపతి అనే వ్యక్తి ఇంట్లో మంటలు వ్యాపించడంతో అందులోనే సజీవ దహనం అయ్యాడు. ఇంట్లో నిద్రిస్తున్న సమయంలో షార్ట్ సర్క్యూట్ తో ఒక్కసారిగా మంటలు వ్యాపించి బయటకు రాలేక మంటల్లో చిక్కుకుని మృతి చెందాడు. సంఘటనకు సంబందించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.