కంచికచర్లలో బాలా త్రిపుర సుందరి దేవిగా దర్శనం
ఎన్టీఆర్ జిల్లా కంచికచర్లలో దసరా నవరాత్రులు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. దేవి నవరాత్రులలో భాగంగా కంచికచర్ల పశువుల హాస్పిటల్ బజారు వాటర్ ప్లాంట్ వద్ద ఏర్పాటు చేసిన అమ్మవారి మండపంలో అమ్మవారు నేడు బాల త్రిపుర సుందరీ దేవిగా గురువారం దర్శనం ఇచ్చారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు.