కంచికచర్ల మండలంలోని పత్తి పంట ఈసారి అన్నదాతల చేతికందని పరిస్థితి ఏర్పడింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, వరదలకు పత్తి పైర్లు దెబ్బతిని నష్టం వాటిల్లింది. పూత, పిందె కాయలు రాలిపోయి, కొన్నిచోట్ల పత్తి పైర్లు నల్లగా ఉండటంతో రైతులు తమ పొలాల్లోని పత్తి మొక్కలను పీకేస్తున్నారు. పైర్లు ఎదగకపోవటంతో దిగుబడులు తక్కువగా వస్తాయని, భారీ నష్టం వాటిల్లుతుందని అన్నదాతలు శుక్రవారం వాపోతున్నారు.