కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రిలోని డాక్టర్ పై దాడికి నిరసనగా సోమవారం మచిలీపట్నం ప్రభుత్వ సర్వజన ఆస్పత్రి నందు డాక్టర్లు నిరసన చేపట్టారు. ఈ నిరసన కార్యక్రమంలో సర్వజన ప్రభుత్వ ఆసుపత్రి డిప్యూటీ సూపర్డెంట్, పలువురు డాక్టర్ల పాల్గొని తమ నిరసన తెలియజేశారు. డాక్టర్ పై దాడి చేసిన వారిపై చర్యలు చేపట్టకపోతే నిరసనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.