ఉచిత ఇసుక పాలసీ పటిష్టవంతంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ డీకే. బాలాజీ అధికారులను ఆదేశించారు. జిల్లా స్థాయి సాండ్ కమిటీ సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన శుక్రవారం మచిలీపట్నం కలెక్టరేట్లో నిర్వహించారు. ఇసుక రీచ్ లలో మిషనరీ, భారీ వాహనాలు అనుమతించకుండా చూడాలని, ఇసుక అక్రమ తవ్వకాలు, రవాణా అరికట్టాలని, ఇందుకోసం ఇసుక రీచ్ ల ప్రవేశ మార్గాల వద్ద చెక్ పోస్టులు ఏర్పాటు చేయాలన్నారు.