మచిలీపట్నం నగరంలో 45వ డివిజన్ లో శనివారం అర్ధరాత్రి స్థానికులు ఆందోళనకు దిగారు. ప్రజల ఆమోదం లేకుండా గృహాల మధ్యలో టవర్ తక్షణమే నిర్మాణాన్ని నిలిపివేయాలంటూ ఆందోళన చేశారు. 45వ డివిజన్ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఫణి కుమార్ ఆధ్వర్యంలో టవర్ నిర్మాణం చేపడుతున్న ఉద్యోగులను నిలదీశారు. హానికరమైన నిర్మాణాన్ని ఆపివేసి వెళ్లిపోవాలంటూ ధర్నా నిర్వహించారు. పోలీసులు రంగ ప్రవేశం చేయటంతో సమస్య సద్దుమణిగింది.