సిఎన్ జి గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించాలి

81చూసినవారు
సిఎన్ జి గ్యాస్ కొరత సమస్యను పరిష్కరించాలి
సిఎన్ జి గ్యాస్ సమస్యను పరిష్కరించి, 500 ఆటో కార్మికుల కుటుంబాలను ఆదుకోవాలని జిల్లా అధికారులను సిఐటియు కృష్ణాజిల్లా కోశాధికారి సుబ్రహ్మణ్యం డిమాండ్ చేశారు. బుధవారం మచిలీపట్నంలో సిఎన్జి గ్యాస్ కొరతను వెంటనే పరిష్కరించాలని కోరుతూ తహసిల్దార్ ఆఫీస్ వద్ద సిఎన్ జి గ్యాస్ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నా అనంతరం మచిలీపట్నం తహసిల్దార్ వినతిపత్రం అందించడం జరిగింది.

సంబంధిత పోస్ట్