యువకుడి ప్రాణం తీసిన స్పీడ్ బ్రేకర్ (వీడియో)

66చూసినవారు
బెంగళూరు-మైసూరు పాత రహదారిపై మండ్య వీసీ ఫాం గేటు వద్ద శనివారం రాత్రి షాకింగ్ ఘటన జరిగింది. రోడ్డుపై అధికారులు హడావుడిగా స్పీడ్ బ్రేకర్ ఏర్పాటు చేశారు. బాగా ఎత్తులో నిర్మించిన ఆ స్పీడ్ బ్రేకర్‌ వల్ల ఓ యువకుడు ప్రమాదానికి గురయ్యాడు. బైక్‌పై నుంచి కింద పడి తీవ్ర గాయాలపాలయ్యాడు. చికిత్స పొందుతూ ఆసుపత్రిలో ఆ యువకుడు కన్నుమూశాడు. మృతుడిని స్థానిక కాంగ్రెస్ నేత శంకరలింగగౌడ కుమారుడిగా అధికారులు గుర్తించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్