మలయాళ ముద్దుగుమ్మ హనీ రోజ్ సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్ సంచలనం రేపుతోంది. తనను ఓ బిజినెస్ మేన్ వెంబడిస్తూ, లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని పేర్కొన్నారు. 'గతంలో ఓ వ్యక్తి నిర్వహించిన ఈవెంట్ కు నేను హాజరయ్యా. అప్పటినుంచి అతడు వెంటపడుతూ, సోషల్ మీడియాలోనూ నా పరువుకు భంగం కలిగేలా ప్రవర్తిస్తున్నాడు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రత్యక్షమవుతున్నాడు' అని ఆమె పేర్కొన్నారు. అతడిపై చట్టపరంగా పోరాడుతా అని తెలిపారు.