Sep 16, 2024, 01:09 IST/
చికెన్ బిర్యానీలో కోడి ఈకలు (వీడియో)
Sep 16, 2024, 01:09 IST
చికెన్ బిర్యానీలో కోడి ఈకలు వచ్చిన ఘటన తెలంగాణలోని హైదరాబాద్‌లో చోటుచేసుకుంది. వనస్థలిపురంలోని సచివాలయం నగర్లో బిర్యాని తినడానికి మేఘన అనే యువతి అతిథి బిర్యాని సెంటర్ కు వెళ్లింది. అయితే చికెన్ బిర్యాని తింటుండగా లెగ్ పీస్‌లో కోడి ఈకలు రావడంతో ఆమె సిబ్బందిని ప్రశ్నించింది. యాజమాన్యం నిర్లక్ష్యంగా సమాధానం చెప్పడంతో.. మేఘన ఫుడ్ సేఫ్టీ అధికారులకు ఫిర్యాదు చేసింది.