అండగా నిలిచిన ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కరిస్తున్నా
వరద బాధితులకు ప్రభుత్వం అందిస్తున్న సహాయానికి తోడుగా చేయూతనందించిన దాతలు, స్వచ్ఛంద సంస్థలకు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చేతులెత్తి ధన్యవాదాలు తెలియజేశారు. బుధవారం నందివాడ మండలంలో వరద ముంపు గ్రామాల్లో ఎమ్మెల్యే రాము ప్రభుత్వం అందించిన నిత్యవసర సరుకుల పంపిణీ కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన తమిరిశ గ్రామంలో నిత్యవసర సరుకుల కిట్లను ప్రజలకు అందజేశారు.