అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా బుధవారం విద్యార్థులతో డ్రగ్స్ నియంత్రణ ర్యాలీ నిర్వహించడం జరిగింది. బుధవారం స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో, నందివాడ పోలీస్ ఆధ్వర్యంలో 100 మంది విద్యార్థులు మనవహారంగా ఏర్పడి డ్రగ్స్ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ సందర్భంగా గుడివాడ స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో సిఐ సత్యవతి మాట్లాడుతూ మత్తు మాదకద్రవ్యాలకు విద్యార్థులు దూరంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.