హైదరాబాద్‌ లో రాత్రి ఒంటి గంట వరకు ఫుడ్‌స్టాల్స్‌కు అనుమతి

53చూసినవారు
హైదరాబాద్‌ లో రాత్రి ఒంటి గంట వరకు ఫుడ్‌స్టాల్స్‌కు అనుమతి
హైదరాబాద్‌ నగరంలో అర్ధరాత్రి ఒంటి గంట వరకు ఫుడ్‌స్టాల్స్‌ నిర్వహణకు పోలీసు శాఖ అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని రకాల ఫుడ్‌స్టాల్స్‌ ఉదయం 5 గంటల నుంచి రాత్రి 1 గంటల వరకు నిర్వహించుకోవచ్చని పేర్కొంది. ఫుడ్‌స్టాల్స్‌ కాకుండా ఇతర దుకాణాలకు ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు, మద్యం షాపులకు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు అనుమతి ఇచ్చింది.

సంబంధిత పోస్ట్