ముసునూరు మండలం చెక్కపల్లిలో గత రాత్రి ఒక రైతు ఇంట్లో దొంగలు పడ్డారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేశారు. ఆదివారం డిఎస్పి ప్రసాద్ ఆధ్వర్యంలో సంఘటన స్థలానికి చేరుకున్నారు. మందలపు రాధాకృష్ణ రైతు ఇంట్లో దొంగలు చొరపడ్డారు. 20 కాసుల బంగారం, 4లక్షలు నగదు, 2.5 కేజీల వెండి దోచుకున్నట్లుగా రైతు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుల పేర్కొన్నాడు. డాగ్ స్క్యాడ్, వేలిముద్రల టీం రంగ ప్రవేశం చేశారు.