నూజివీడు పోలీస్ సర్కిల్ పరిధిలోని ముసునూరు పోలీస్ స్టేషన్ లో గల రమణక్కపేట గ్రామంలో బంగారపు షాపులో దొంగతనం కలకలం రేగుతుంది. నూజివీడు- ధర్మాజీగూడెం ప్రధాన రహదారి పక్కనే గల బంగారపు షాపులో గత రాత్రి దొంగతనం జరిగింది. విగ్నేశ్వర జువెలరీ షాప్ లో దొంగతనం జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. దీనికి సంబంధించి సీసీ కెమెరా ఫుటేజ్ లో అగంతకుడు దృశ్యాలు నవోదయ ఉన్నాయి.