పామర్రు: తోట్లవల్లూరులో విద్యుత్ సరఫరా నిలిపివేత

70చూసినవారు
పామర్రు: తోట్లవల్లూరులో విద్యుత్ సరఫరా నిలిపివేత
తోట్లవల్లూరు సబ్ స్టేషన్ పరిధిలో విద్యుత్ లైన్ ల మరమ్మతుల కారణంగా శనివారం విద్యుత్ సరఫరాని నిలిపివేస్తున్నట్లు ఉయ్యూరు సబ్ డివిజన్ ఇంజనీర్ కృష్ణ వినాయక్ శుక్రవారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. శనివారం ఉదయం మండలంలోని తోట్లవల్లూరు, బద్రిరాజుపాలెం, బొడ్డపాడు, చిన్న పులిపాక గ్రామాల్లో ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు విద్యుత్ సరఫరా ఉండదు అన్నారు.

సంబంధిత పోస్ట్