ఇటీవల కాలంలో వచ్చిన తుఫానుతో తీవ్రంగా నష్టపోయమని, మాకు నష్టపరిహారం అందలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం పెడన నియోజకవర్గంలోని బల్లిపర్రు గ్రామానికి చెందిన రైతులు మీడియాతో మాట్లాడారు. తుఫాను కారణంగా పంట దెబ్బతిని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని తెలిపారు. ప్రభుత్వం నుంచి రావలసిన నష్టపరిహారం రాక కార్యాలయాలు చుట్టూ తిరిగి విసిగిపోయామని మాకు పరిహారం అందించాలన్నారు.