పెడన నియోజకవర్గంలోని కృత్తివెన్ను మండలం చిన్నపాండ్రక గ్రామం, బంటుమిల్లి మండలాల్లో అక్రమ మట్టి మాఫియా కొనసాగుతుంది. రెవెన్యూ శాఖ అటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదని గ్రామస్తులు వాపోతున్నారు. మంగళవారం అర్ధరాత్రి సమయంలో అక్రమ మట్టి తరలించారని, ట్రాక్టర్ల మోతతో కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. పంట పొలాల గట్లను తవ్వి రవాణా చేస్తున్నారని వాపోయారు.