చేనేత రంగానికి మరోసారి అన్యాయం జరిగిందని ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షులు కట్ట హేమ సుందరరావు ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ చేనేత కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం పెడన పట్టణంలో సర్వోదయ సొసైటీ నందు విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుందర్రావు మాట్లాడుతూ గత ప్రభుత్వం సహకార సంఘాలకు ఇవ్వవలసిన బకాయిలు గత ఆరు సంవత్సరాలుగా విడుదల చేయకపోవడంతో బాధాకరం అన్నారు.