తిరువూరు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు అందజేత

81చూసినవారు
తిరువూరు ఎమ్మెల్యే చేతుల మీదుగా చెక్కులు అందజేత
కూటమి ప్రభుత్వం ప్రజారోగ్యానికి అధిక ప్రాదాన్యత ఇస్తుందని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అన్నారు. ఆదివారం తిరువూరు నియోజకవర్గ పరిధిలోని 26 మంది లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి ద్వారా రూ. 18 లక్షల 74,379 చెక్కులను ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు అందజేశారు. ఈ మేరకు తిరువూరు ఎమ్మెల్యే కార్యాలయంలో బాధితులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే చేతుల మీదుగా అందజేశారు.

సంబంధిత పోస్ట్