తిరువూరు పట్టణంలోని బైపాస్ రోడ్డు జాతీయ రహదారి పశువుల సంత దగ్గర రోడ్డు ప్రమాదం ఆదివారం జరిగింది. వియం బంజర్ నుండి తిరువూరు వస్తుండగా ద్విచక్ర వాహనం అదుపుతప్పి రిమైండర్ కు ఢీకొనడంతో తిరువూరు మండలం అక్కపాలెం గ్రామానికి చెందిన వేపాకుల విష్ణు (35 సంవత్సరాలు) అనే వ్యక్తి సంఘటనా స్థలంలోనే మృతి చెందినట్లుగా స్థానికులు చెప్తున్నారు.