పెనుగొలను: తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు

67చూసినవారు
పెనుగొలను: తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు
గంపలగూడెం మండలం పెనుగొలను‌లో గురువారం షిరిడి సాయిబాబా సేవా కమిటీ ఆధ్వర్యంలో తొలి తెలుగు కవయిత్రి మొల్ల జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ఆమె చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. విలువలతో కూడిన కవిత్వాన్ని, రామాయణాన్ని సామాన్యులకు సైతం అర్థమయ్యే రీతిలో తెలుగు భాషలో రచించిన మొల్ల చరిత్రలో నిలిచిపోయారని పలువురు కొనియాడారు. అనంతరం సాయిబాబా కమిటీ సభ్యులు మిఠాయిలు పంచిపెట్టారు.

సంబంధిత పోస్ట్