కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలను వెంటనే అమలు చేయాలని ఏపీ యాదవ కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ కాలసాని విజయలక్ష్మి డిమాండ్ చేశారు. తిరువూరు నియోజకవర్గంలో ఆమె ఆదివారం మాట్లాడుతూ, సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయలేక మహిళలను అవమానించే విధంగా మహిళా మంత్రి మాట్లాడుతు న్నారని ఆమె విమర్శించారు. మంత్రి మహిళలకు వెంటనే క్షమాపణ చెప్పాలని ఆమె డిమాండ్ చేశారు.