ముస్లిం యువకులపై గత సంవత్సరం టీడీపీ ప్రభుత్వం అక్రమంగా పెట్టిన కేసులను కొట్టి వేసినందుకు, విస్సన్నపేట పట్టణ ముస్లింలు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియచేసారు. ఈ సందర్భంగా మండల మాజీ కో ఆప్షన్ సభ్యులు దస్తగిరి మాట్లాడుతూ..గత సంవత్సరం టీడీపీ గుంటూరులో నిర్వహించిన నారా హమారా కార్యక్రమంలో నిరసన వ్యక్తం చేసిన, ముస్లిం మైనారిటీ యువకుల పై అక్రమ కేస్ పెట్టి ఆ యువకులను మానసిక క్షోభకు గురి చేసారని విమర్శించారు. ఆ కేసును ప్రస్తుత ప్రభుత్వం కొట్టి వేసినందుకు వారు సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ కో ఆప్షన్ సభ్యులు దస్తగిరి బుడే, సుభాని, మోసీన్, కరిమ, బాజి, ముస్లిం నాయకులు పాల్గొన్నారు.