పెనుగొలనులో జాతీయ బాలికా దినోత్సవం
గంపలగూడెం మండలం పెనుగొలనులో శుక్రవారం షిరిడి సాయిబాబా సేవ కమిటీ ఆధ్వర్యంలో జాతీయ బాలికా దినోత్సవం ఘనంగా నిర్వహించారు. సమాజంలో బాలికల సంరక్షణ, హక్కులు, ఆరోగ్యం , విద్యా, సామాజిక ఎదుగుదల మొదలైన అంశాలపై అంగన్వాడీ టీచర్ కె. లింగమ్మ అవగాహన కల్పించారు. బాలుడిని బాలికని సమానంగా చూస్తామని సాయిబాబా కమిటీ అధ్యక్షులు వూటుకూరు నారాయణరావు ప్రతిజ్ఞ చేయించారు.