బెజవాడ లో 30 ఏళ్ల రికార్డ్ బద్దలు

57చూసినవారు
బెజవాడ లో 30 ఏళ్ల రికార్డ్ బద్దలు
బెజవాడలో శనివారం రికార్డ్‌ వర్షం నమోదవడంతో 30 ఏళ్ల రికార్డ్ బద్దలైంది. చరిత్రలో ఎన్నడూ లేనంతగా ఒకే రోజు 29 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. రెండు రోజులుగా విజయవాడలో కుండపోత కురవడంతో అనేక కాలనీల్లో నాలుగు అడుగుల మేర వర్షం నీరు నిలిచింది. అలాగే ఆటోనగర్ నుంచి బెంజి సర్కిల్‌ వరకు కూడా నీరు నిలిచింది. ఈ వర్షాలతో నగరంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు.

సంబంధిత పోస్ట్