తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. వానధాటికి ప్రజా జీవనం అస్తవ్యస్తమవుతుంది. అయితే హైదరాబాద్‌లోని ఓ రైతు బజార్లో వర్షానికి పలు కూరగాయల దుకాణాల్లోని కూరగాయలు, ఆకుకూరలు నీటిలో కొట్టుకుపోయాయి. ఇది చూసిన అక్కడి స్థానికులు వాటిని ఏరుకుని సంచిలో వేసుకున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.