విజయవాడ: చాగంటిని సన్మానించిన ముఖ్యమంత్రి
భారతీయ కుటుంబ వ్యవస్థ గొప్పతనాన్ని నేటితరం తెలుసుకోవాల్సిన అవసరం ఉందని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. సోమవారం విజయవాడలో ప్రభుత్వ సలహాదారు చాగంటి కోటేశ్వరరావును సీఎం సన్మానించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులు, యువతలో నైతిక విలువలు పెంచేందుకు ప్రయత్నించాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు.