దేశంలో కేంద్ర ప్రభుత్వ, అనుబంధ సంస్థలలో వివిధ హోదాలలో బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళా ఉద్యోగుల సమస్యల పరిష్కారం నిరంతర పోరాటాలతోనే సాధ్యమవుతుందని సిఐటియు జాతీయ కార్యదర్శి కామ్రేడ్ ఏ. ఆర్. సింధు అన్నారు. కాన్ఫెడరేషన్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయిస్ మరియు కార్మికుల 6వ జాతీయస్థాయి రెండు రోజుల సదస్సు పోరంకి లోని ఆర్. సీతాలక్ష్మీనగర్ శనివారం ప్రారంభమైంది.