ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) ద్వారా అందుతున్న అర్జీలకు అధికారులు నాణ్యమైన పరిష్కారాన్ని చూపడం ప్రధానమని
కలెక్టర్ డా. జి. సృజన తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా సోమవారం కలెక్టరేట్ పింగళి వెంకయ్య సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ సృజన. పౌర సరఫరాల డీఎం జి. వెంకటేశ్వర్లు, హౌసింగ్ పీడీ రజనీకుమారితో కలిసి అర్జీదారుల నుంచి వినతులు స్వీకరించారు.