గత వైసీపీ ప్రభుత్వ హయంలో నష్టపోయిన కాంట్రాక్టర్లను ఆదుకున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందని ఆదోని జనసేన పార్టీ ఇన్ఛార్జి మల్లప్ప అన్నారు. ఆదివారం ఆదోనిలో మాట్లాడారు. మాజీ ఎమ్మెల్యే సాయిప్రసాద్ రెడ్డిని నమ్మి కోట్లకు, కోట్లు వడ్డీలకు తెచ్చుకుని పనులు చేయిస్తే, కాంట్రాక్టర్లను ఏమాత్రం పట్టించుకోలేదని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వంపై చేస్తున్న నిరాధారమైన ఆరోపణలను మానుకోవాలన్నారు.