ప్యాపిలి మండలంలోని పోతు దొడ్డిలో కొండపై వెలసిన మౌలాలిస్వామి ఉరుసు ఉత్సవాలను గ్రామ ప్రజలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శుక్రవారం కులమతాలకు అతీతంగా భక్తులు అధిక సంఖ్యలో హాజరై మొక్కులు తీర్చుకున్నారు. శనివారంతో ఉరుసు ఉత్సవాలు ముగియనున్నట్లు గ్రామ పెద్దలు తెలిపారు.