ఆంద్రప్రదేశ్ పిసిసి అధ్యక్ష బాధ్యతలు చేపట్టి మొట్టమొదటిసారిగా కర్నూలు పర్యటనకు వస్తున్న షర్మిల పర్యటనను విజయవంతం చేయాలని జిల్లా కాంగ్రెస్ నాయకులను, కార్యకర్తలను కోడుమూరు నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జ్, పిసిసి ప్రధాన కార్యదర్శి దామోదరం రాధాకృష్ణమూర్తి కోరారు. కాంగ్రెస్ పార్టీ అవసరం రాష్ట్రానికి, ప్రజలకు ఎంతో ఉందని అన్నారు.